దుర్గమ్మ తల్లి ఆలయంలో దొంగలు పడ్డారు

SKLM: వజ్రపుకొత్తూరు మండలం సుంకర జగన్నాధపురంలో శ్రీ దుర్గమ్మ తల్లి ఆలయంలో గురువారం అర్ధరాత్రి సమయంలో 2 కేజీల వెండి, 2 తులాల బంగారం దొంగలు ఎత్తుకెళ్లి పోయారు. వెండి విగ్రహం, కిరీటం, బంగారం ఆభరణాలు పోయాయని ఆలయ దాసురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం ఉదయం పూజ చేసేందుకు వచ్చిన దాసురాలు అమ్మ ఆలయం తాళం పగలగొట్టినట్లు ఉండటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు.