రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
కృష్ణా: మచిలీపట్నం నుంచి నరసాపురం వెళ్లే జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గురువారం ఓ వ్యక్తి మృతి చెందాడు. నర్సాపూర్ వైపు నుంచి వెళ్తున్న కారు ఇద్దరు ద్విచక్ర వాహనదారులను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేపట్టారు.