పాఠశాల మరమ్మతుల కోసం ఎమ్మెల్యేకు వినతి

పాఠశాల మరమ్మతుల కోసం ఎమ్మెల్యేకు వినతి

మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావుకు కాట్రియాల గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు గడిల నాగేష్ శుక్రవారం వినతి పత్రం అందజేశారు. కాట్రియాలలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల శిథిలావస్థకు చేరిందని, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. పాఠశాలకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.