ఈ నెల 25న శ్రీ అద్దంకి నాంచారమ్మ జాతర

కృష్ణాజిల్లా: మోపిదేవి మండలం, పెద్దప్రోలు గ్రామంలో శ్రీ అద్దంకి నాంచారమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఈనెల 25వ తేదీన నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వహకులు కూరపాటి కోటేశ్వరరావు తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా తెల్లవారుజాము నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు చెప్పారు.