గుర్తు తెలియని మహిళ మృతి

గుర్తు తెలియని మహిళ మృతి

SDPT: గజ్వేల్ పట్టణంలో గుర్తు తెలియని మహిళ మృతి చెందినట్లు గజ్వేల్ ఇన్స్పెక్టర్ బీ.సైదా తెలిపారు. పట్టణంలోని ప్రభుత్వాసుపత్రి ఎదుట మంగళవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో 50 ఏళ్ల మహిళ చనిపోయి ఉందన్నారు. యాచకురాలిగా గుర్తించామని ఎత్తు 41/2 ఇంచులు ఉంటుందని తెలిపారు. ఎవరైనా గుర్తిస్తే గజ్వేల్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని కోరారు.