రాజకీయ పార్టీల విరాళాలపై సుప్రీంలో పిటిషన్

రాజకీయ పార్టీల విరాళాలపై సుప్రీంలో పిటిషన్

రాజకీయ పార్టీలకు రూ.2 వేల లోపు విరాళాలు అందించే వారి వివరాలు వెల్లడించాల్సిన అవసరం లేదంటూ ఐటీ చట్టంలో ఉన్న వెసులుబాటును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలంటూ కేంద్రం, ఈసీ, బీజేపీ, కాంగ్రెస్ తదితర పార్టీలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.