ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
SRCL: ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకస్మిక తనిఖీ చేశారు. సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్ పరీక్ష కేంద్రంలో కలెక్టర్ తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు, కనీస వసతుల కల్పనను పరిశీలించి, అధికారులతో మాట్లాడారు. ఈ పరిశీలనలో తహసీల్దార్ మహేష్ కుమార్, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.