దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

కృష్ణా: దివ్యాంగుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం అని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. గురువారం అవనిగడ్డ బస్టాండులో దివ్యాంగశక్తి పథకాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అర్హత కలిగిన దివ్యాంగులకు ఉచిత బస్ పాసులు అందచేశారు. బస్సులో దివ్యాంగులకు ఉచిత టికెట్లు అందచేసి వారితో కలిసి చల్లపల్లి వరకు ప్రయాణించారు. ఇందులో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.