మరో 11 విమానాశ్రయాల్లో ఉడాన్ యాత్రి కెఫేలు
దేశంలో మరో 11 విమానాశ్రయాల్లో ఉడాన్ యాత్రి కెఫేలు అందుబాటులోకి రానున్నాయి. రాజ్‌కోట్, చండీగఢ్, ఇండోర్, జమ్మూ, పాట్నా, అమృత్‌సర్, వారణాసి, గ్వాలియర్, అగర్తల, జైపూర్, లక్నోలో ఉడాన్ కెఫేలను ఈరోజు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించనున్నారు. ఈ కెఫేలలో తక్కువ ధరకే టీ, కాఫీ, స్నాక్స్‌తో పాటు పలు ఆహార పదార్థాలు లభించనున్నాయి.