'నేటి నుంచి గ్రామాల్లో సామాజిక తనిఖీల నిర్వహణ'
SKLM: జలుమూరు మండల పరిషత్ కార్యాలయంలో నేటి నుంచి గ్రామాల్లో సామాజిక తనిఖీలు నిర్వహిస్తామని MPDO బీ చిన్నముడు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉపాధి హామీ పథకంలో సామాజిక తనిఖీలు పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ తనిఖీలు ఈనెల 28వ తేదీ వరకు కొనసాగుతాయని, అనంతరం ప్రజా వేదిక చేపడతామన్నారు.