మున్సిపల్ కార్యాలయంలో తప్పిన ప్రమాదం

మున్సిపల్ కార్యాలయంలో తప్పిన ప్రమాదం

KRNL: ఆదోని మున్సిపల్ కార్యాలయంలో శనివారం తృటిలో పెను ప్రమాదం తప్పింది. కార్యాలయం ఫస్ట్ ఫ్లోర్ మెట్లపైన పైకప్పు పెచ్చులు ఊడిపడ్డాయి. ఘటన జరిగిన సమయంలో ఎవరూ మెట్లపై లేకపోవడంతో అదృష్టవశాత్తు ప్రమాదం చోటుచేసుకోలేదు. పెచ్చులు ఒక్కసారిగా  పడిన శబ్దంతో ఉద్యోగులు భయంతో ఉలిక్కిపడ్డారు.