ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెంచాలి: కలెక్టర్
వనపర్తి: ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తావన సంఖ్య పెంచే విధంగా వైద్య అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ తన చాంబర్లో వైద్యశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో ప్రతి గర్భిణీ మహిళను తప్పనిసరిగా నమోదు చేయాలని, ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్యను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.