మట్టి వినాయక విగ్రహాల పంపిణీ చేసిన ఎమ్మెల్యే

W.G: భీమవరంలో మట్టి విగ్రహాలను ఎమ్మెల్యే పూలవర్తి రామాంజనేయులు శనివారం పంపిణీ చేశారు. భారతీయులందరూ సంప్రదాయంగా జరుపుకునే తొలి పండుగ వినాయక చవితి అని, వేలాది విగ్రహాలను ఉచితంగా అందించడం గొప్ప విశేషమని అన్నారు. గత 13 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులు సుబ్బరాజును ఎమ్మెల్యే అభినందించారు. అలాగే పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలన్నారు.