గణేష్ ఉత్సవాలకు ఆంక్షలు విధించిన ఎస్పీ

కృష్ణా: ఎస్పీ ఆర్.గంగాధరరావు గణేష్ నవరాత్రి ఉత్సవాల నిర్వాహకులకు ముందస్తు జాగ్రత్తలు పాటించాలని బుధవారం ఒక ప్రకటనలో సూచించారు. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతులను ప్రతిష్టించాలని చెప్పారు. డీజేలు, బాణాసంచా నిషేధమని పేర్కొన్నారు. రోడ్లపై మండపాలు ఏర్పాటు చేయకూడదని వివరించారు. అన్ని శాఖల అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని స్పష్టం చేశారు.