'బస్సు సౌకర్యం కల్పించాలి'

VKB: బొంరాస్‌పేట మండల పరిధిలోని పలు గ్రామాలకు బీటీ రోడ్డు సౌకర్యం ఉన్న ఆర్టీసీ బస్సు రావడంలేదని ప్రజలు ఆరోపించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహాలక్ష్మి పథకం ద్వారా గ్రామాల నుంచి పట్టణాలకు వెళ్లేందుకు బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సి వస్తుందన్నారు. అధికారులు స్పందించి బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు.