VIDEO: తెగిపోయిన రోడ్డును పరిశీలించిన ఎమ్మెల్యే

MDK: శివంపేట మండలం పోతుల బోగుగూడ గ్రామ శివారులో భారీ వర్షాలకు తెగిపోయిన రోడ్డును ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి పరిశీలించారు. గత రాత్రి కురిసిన భారీ వర్షానికి ఇటీవల నిర్మించిన రోడ్డు వంతెన తెగిపోవడంతో పంటలు నీట మునిగిపోయాయి. దీంతో అధికారులు స్పందించి వెంటనే మరమ్మత్తు పనులు చేపట్టాలని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి సూచించారు.