కొత్తవలస ఆర్టీసీ కాంప్లెక్స్‌ను తనిఖీ చేసిన డీఎం
VZM: శృంగవరపుకోట ఆర్టీసీ డిపో మేనేజర్ సుదర్శనరావు కొత్తవలస ఆర్టీసీ కాంప్లెక్స్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కాంప్లెక్స్‌లో ఉన్న మరుగుదొడ్లు, పరిసరాలను తనిఖీ చేసి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు కాంప్లెక్స్ ఆవరణ పరిశుభ్రంగా ఉండాలని, ఆహార నాణ్యత పాటించాలని నిర్వహకుడు విష్ణుకు సూచించారు. ప్రతి బస్సు ప్లాట్ పారంపై నిలిచేలా చర్యలు చేపడతామని చెప్పారు.