రైతులు ఆందోళన చెందొద్దు: తహసీల్దార్

MDK: రైతులు యూరియాపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిజాంపేట తహసీల్దార్ శ్రీనివాస్, మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి అన్నారు. ఈ మేరకు నిజాంపేటలో మాట్లాడుతూ.. ఈ నెలలో కావాల్సిన యూరియా ప్రభుత్వం పంపిస్తుందని, రైతులు ఎవరూ ఎలాంటి అపోహలను నమ్మవద్దన్నారు. అలాగే యూరియాను అధిక మొత్తంలో వాడవద్దని, తక్కువ మోతాదులో వాడాలన్నారు.