పైనంపల్లి గ్రామ పంచాయతీలో ముగిసిన ఎన్నికలు
KMM: నేలకొండపల్లి మండలం పైనంపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మధ్యాహ్నం 12 గంటల వరకు 85 శాతం భారీ పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. పోలింగ్ ముగిసిన అనంతరం, మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పూర్తిస్థాయి ఏర్పాట్లు చేశారు.