నూతన శివాలయం శంకుస్థాపన లో పాల్గొన్న ఎమ్మెల్యే

తూ.గో: పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ గురువారం అయినవిల్లి మండలం విలస గ్రామంలో శివాలయం శంకుస్థాపనలో పాల్గొన్నారు. గ్రామాల్లో ఆలయాల నిర్మాణం ఆధ్యాత్మిక శోభను పెంచుతుందని తెలిపారు. ఆలయ నిర్మాణానికి తన పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.