10 కేజీల గంజాయితో ఒకరు అరెస్ట్: చీడికాడ ఎస్ఐ

VSP: అక్రమంగా తరలిస్తున్న 10 కేజీల గంజాయి స్వాధీన పరుచుకుని ఒకరిని అరెస్టు చేసినట్లు చీడికాడ ఎస్ఐ బి.సతీశ్ తెలిపారు. పెదబయలు మండలం గోమంగి పంచాయతీకి చెందిన డూరు శంకర్రావు(17), మరో యువకుడు కలిసి గంజాయి తీసుకు వస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. ఒకరు పారిపోగా శంకరరావును అరెస్టు చేసి బైక్, గంజాయి స్వాధీనం చేసుకున్నామన్నారు.