'ఉపాధ్యాయులతోపాటు తల్లిదండ్రుల శ్రద్ద ముఖ్యం'

'ఉపాధ్యాయులతోపాటు తల్లిదండ్రుల శ్రద్ద ముఖ్యం'

ASR: అరకులోయ మండలంలో మెగా పేరెంట్-టీచర్ సమావేశాలు శుక్రవారం ఘనంగా జరిపారు. మండలంలోని కంఠబౌసుగూడ ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఎంఈవో-1 వి త్రినాధరావు పాల్గొన్నారు. రానున్నది పరీక్షల కాలం కావున విద్యార్ధుల చదువుపై ఉపాధ్యాయులతోపాటు తల్లిదండ్రులు కూడా శ్రద్ద తీసుకోవాలని ఆయన తెలిపారు. పాఠశాల అభివృద్ధిలో తల్లిదండ్రులు సహకారం తప్పనిసరని హెచ్ఎం అన్నారు.