డీజేలు పెడితే బైండోవర్ కేసులు : ఎస్సై

డీజేలు పెడితే బైండోవర్ కేసులు : ఎస్సై

SRPT: గణేష్ నిమజ్జనం రోజున డీజేలకు అనుమతి లేదని మంగళవారం మేళ్లచెరువు ఎస్సై పరమేష్ అన్నారు. మేళ్లచెరువు మండలంలోని కొన్ని గ్రామాలకు చెందిన గణేష్ సంఘం సభ్యులవద్ద డీజే నిర్వహకులు అడ్వాన్సులు తీసుకున్నట్లుగా వారి దృష్టికి వచ్చినట్లు తెలిపారు. కనుక ఎవరైనా చట్టాన్ని అతిక్రమించి గణేష్ ఉత్సవాలకు డీజేలు పెడితే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.