ఎలుగుబంట్లు సంచారం..భయం గుప్పిట్లో ప్రజలు

ఎలుగుబంట్లు సంచారం..భయం గుప్పిట్లో ప్రజలు

ATP: రాయదుర్గం పట్టణ శివారులో ఎలుగుబంట్ల సంచారం అధికమవుతుంది. కొన్నిరోజులుగా బళ్లారి రోడ్డు, నగరవనం పార్కు, బైపాస్ రోడ్డులో వాటి సంచారం ఉండగా, శుక్రవారం అనంతపురం బైపాస్ రోడ్డులోని మద్యనేశ్వర ఆలయం వద్ద తిరుగుతూ కనిపించినట్లు స్థానికులు తెలిపారు. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వన్యప్రాణి శాఖ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.