VIDEO: 'గరిష్ట వేతనం అందేటట్లు పనులు కల్పించండి'

SRD: ఉపాధి హామీ పథకంలో పనులను చేస్తున్న కూలీలకు ప్రతిరోజు గరిష్ట వేతనం అందేటట్లు పనులు కల్పించాలని ఉపాధి సిబ్బందికి మండల అభివృద్ధి అధికారి సత్తయ్య ఆదేశించారు. శనివారం కంగ్టి మండల నాగూర్(కె) గ్రామంలో ఆయన ఉపాధి హామీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూలీలకు అవగాహన కల్పిస్తూ మూడు మీటర్ల పొడవు ఒక మీటర్ వెడల్పుతో రెండు అడుగుల ఎత్తుగా కట్టలు నిర్మించాలన్నారు.