రాజమండ్రి SKVTలో ఉగాది ఉత్సవం..!
E.G: రాజమండ్రి SKVT డిగ్రీ కళాశాల నందు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవం ఆదివారం సాయంత్రం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంఘం విజయవాడ కార్యదర్శి రాజేంద్ర పాల్గొని మాట్లాడారు. దేశం బలంగా ఉండాలంటే కుటుంబ వ్యవస్థ బలంగా ఉండాలన్నారు. దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలు పణంగా పెట్టిన ఎంతో మంది దేశ భక్తులు ఉన్నారని అన్నారు.