గ్రీన్ ఫీల్డ్ హైవే భూ నిర్వాసితుల కోసం ఆర్బిట్రేషన్

WGL: గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే ఏర్పాటులో భూమి కోల్పోయిన గీసుకొండ మండలం మనుగొండ, సంగెం మండలం సంగెం గ్రామ రైతులకు అవార్డ్ పాస్ చేయడం కోసం జిల్లాలో ఆర్బిట్రేషన్ నిర్వహించారు. కలెక్టర్ సత్య శారద అధ్యక్షతన కలెక్టరేట్‌లో బుధవారం ఈ సమావేశం జరిగింది. ఇందులో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీవో సత్యపాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.