ఆ విషయంలో నేను అదృష్టవంతురాలిని: సుప్రియ
'డెకాయిట్' ప్రమోషన్స్‌లో నిర్మాత సుప్రియ యార్లగడ్డ ఆసక్తికర విషయాలు పంచుకుంది. అడివి శేష్ గత చిత్రాలకంటే ఇది భిన్నమైన థ్రిల్లర్ లవ్ స్టోరీ అని చెప్పింది. ముఖ్యంగా ఈ సినిమాకు ఎక్కువ మంది మహిళలు పనిచేశారని, ఇండస్ట్రీలో మహిళల సంఖ్య పెరిగితేనే అసమానతలు తొలగుతాయని తెలిపింది. తనకు సినీ నేపథ్యం ఉండడం అదృష్టంగా భావిస్తానని, అది తనకు భరోసానిచ్చిందని పేర్కొంది.