జిల్లా ఉత్తమ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఎంపిక

NLR: జిల్లా ఉత్తమ డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా కొండాపురం మండల మానవ వనరుల శాఖ సిబ్బంది రేష్మపర్వీన్ ఎంపికయ్యారు. దాదాపు పది సంవత్సరాలుగా ఎంఈవో కార్యాలయంలో విధులలో అంకితభావంతో పని చేసినందున ఆమె ఈ అవార్డుకు ఎంపికయ్యారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రేష్మపర్వీన్‌కు డీఈవో కార్యాలయంలో డీఈవో బాలాజీ రావు చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు.