VIDEO: అందెశ్రీకి నివాళులర్పించిన కవిత
NZB: ప్రముఖ కవి అందెశ్రీ పార్థీవ దేహానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సోమవారం నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. స్వరాష్ట్ర సాధన ఉద్యమం, సాంస్కృతిక పోరాటంలో ఆయన పోషించిన పాత్ర సదా స్మరణీయమన్నారు.