ఎమ్మెల్యేను కలిసిన జిల్లా ప్రజా రవాణా అధికారిణి

ఎమ్మెల్యేను కలిసిన జిల్లా ప్రజా రవాణా అధికారిణి

VZM: సూపర్ సిక్సు అమలులో భాగంగా ఆగస్టు 15 స్త్రీ శక్తి పథకం ప్రారంభ నేపథ్యంలో విజయనగరం ప్రజా రవాణా అధికారిణి జి. వరలక్ష్మి ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారిని ఆమె క్యాంపు కార్యాలయంలో బుధవారం మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. ఆగస్టు 15న ఎస్.కోట డిపోలో జరిగే ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానం అందించారు. అనంతరం ఉచిత బస్సులపై ఇరువురు చర్చించుకున్నారు.