అమిత్ షాపై మోదీ ప్రశంసలు
కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ప్రధాని మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. నక్సలిజంపై అమిత్ షా చేసిన ప్రసంగం అద్భుతమని కొనియాడారు. దశాబ్దాలుగా తిరోగమన మావోయిస్టు భావజాలం అనేక ప్రాంతాల అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపిందని మోదీ పేర్కొన్నారు. గత దశాబ్ద కాలంలో తమ ప్రభుత్వం ఈ దురాచారాన్ని సమూలంగా నిర్మూలించడానికి నిరంతరం కృషి చేసిందంటూ ప్రధాని ట్వీట్ చేశారు.