తుంగభద్ర ఎల్లెల్సీ కాలువ వద్ద ప్రమాద సూచన

తుంగభద్ర ఎల్లెల్సీ కాలువ వద్ద ప్రమాద సూచన

KRNL: ఆలూరు నియోజకవర్గంలోని హొళగుంద వద్ద తుంగభద్ర దిగువ కాలువ (ఎల్లెల్సీ) 209 కి.మీ వద్ద గట్టు లైనింగ్ కుంగిపోవడంతో నిన్న స్థానిక రైతుల్లో ఆందోళన నెలకొంది. ఆధునీకరణ పనులు కొనసాగుతున్న ఈ ప్రాంతంలో వచ్చే నెల 10న నీటి విడుదల నేపథ్యంలో గట్టుకు గండి పడితే భారీ నష్టం వాటిల్లుతుందని భావిస్తున్నారు. అధికారులు అప్రమత్తమై తక్షణ చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.