'పట్టణ సుందరీకరణే లక్ష్యం'
పార్వతీపురం పట్టణం సుందరీకరణే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రధానంగా పారిశుద్ధ్యం విషయంలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకుంది. పరిసరాల పరిశుభ్రత పాటించకుండా ఎక్కడికక్కడే చెత్త వేసేవారు ఇకపై అపరాధ రుసుము చెల్లించాల్సి ఉంటుందని పుర కమిషనర్ డి.పావని తెలిపారు. ప్రజలు ప్రధాన కూడళ్లు, కాలనీల్లో రహదారులపై వ్యర్థాలు వేయకుండా చర్యలు చేపట్టాలని ఆమె అధికారులను ఆదేశించారు.