పరీక్షా కేంద్రాల్లో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
KMM: విద్యార్థులు భయం విడిచి ధైర్యంగా పరీక్షలు రాయాలని అదనపు కలెక్టర్ శ్రీజ సూచించారు. శనివారం ఆమె కారేపల్లిలోని పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించిన ఆమె, అక్కడి మైదానాన్ని క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని అధికారులకు సూచించారు.