నీరు నిల్వకుండా నాళాలు శుభ్రం చేయాలి: మేయర్
WGL: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 11వ డివిజన్ పోతన నగర్‌లో మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ ఇవాళ పర్యటించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. వర్షాల వల్ల నీరు నిల్వ ఉండకుండా నాళాలు శుభ్రం చేయాలని స్థానిక అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మేయర్ సూచించారు.