డిప్యూటీ సీఎంతో పోలవరం ఎమ్మెల్యే భేటీ

డిప్యూటీ సీఎంతో పోలవరం ఎమ్మెల్యే భేటీ

ELR: పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని మౌలిక వసతుల అభివృద్ధి, ముఖ్యంగా రహదారి నిర్మాణాల కోసం సుమారు 50 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయాలని కోరారు. అలాగే కొయ్యలగూడెం ప్రభుత్వ ఆసుపత్రిని 30 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయాలన్నారు.