మునగాలలో పెట్రోల్ బంకుల వద్ద 'నో స్టాక్' బోర్డులు
SRPT: మునగాల మండల కేంద్రంతో పాటు జాతీయ రహదారి వెంబడి ఉన్న పెట్రోల్ బంకుల్లో ఇంధన కొరత వేధిస్తోంది. గత కొన్ని రోజులుగా పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల ప్రభావం స్థానిక ఇంధన సరఫరాపై తీవ్రంగా పడుతోంది. మూడు రోజుల క్రితం వరకు వాహనాల రద్దీతో కళకళలాడిన బంకులు, నేడు 'నో స్టాక్' బోర్డులతో వెలవెలబోతున్నాయి.