తెనాలి మారేసుపేటలో పోలీసుల పల్లెనిద్ర

తెనాలి మారేసుపేటలో పోలీసుల పల్లెనిద్ర

GNTR: తెనాలి త్రీ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో సోమవారం రాత్రి మారీసుపేటలో పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. త్రీ టౌన్ సీఐ రమేష్ బాబు ఈ కార్యక్రమంలో పాల్గొని, ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. పల్లెనిద్రలో భాగంగా సీఐ రాత్రికి కాలనీలోనే బస చేశారు.