జిల్లాలో అడవుల్లో హైలెర్ట్.. బలగాల మొహరింపు
ములుగు, భూపాలపల్లి జిల్లాల అటవీ సరిహద్దుల్లో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. మావోయిస్టు కదలికలపై ఇంటెలిజెన్స్ సమాచారంతో గ్రేహౌండ్స్, ఎస్‌ఐబీ దళాలు కూంబింగ్ చేపట్టాయి. కీలక మార్గాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు చేస్తున్నారు. అటవీ గ్రామాల్లో నిఘా పెంచి ప్రజలను అప్రమత్తం చేశారు. ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోనూ గస్తీ కట్టుదిట్టం చేశారు.