బండ్ పరిరక్షణ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

E.G: కొవ్వూరు మండలం మద్దూరు లంక వద్ద గోదావరి బండ్ పరిరక్షణ చేపట్టిన పనులకు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు మంగళవారం సాయంత్రం శంకుస్థాపన చేశారు. గోదావరి వరద ప్రవాహం కారణంగా ఏటా మద్దూరు లంక ముంపుకు గురై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారన్నారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లగా బండ్ పరిరక్షణకు రూ. 5 లక్షలు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.