బ్రాహ్మణవెల్లంల గ్రామంలో ఘనంగా మే డే వారోత్సవాలు

NLG: మేడే వారోత్సవాలలో భాగంగా నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణవెల్లంల గ్రామంలో ఇవాళ గ్రామ భవన నిర్మాణ కార్మిక సంఘం (CITU) ఆధ్వర్యంలో సంఘం అధ్యక్షులు చిరుమర్తి లింగస్వామి జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికుల హక్కులను కాపాడటంలో తన వంతు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో సంఘం సభ్యులు తదితరులు ఉన్నారు.