8వ రాష్ట్రీయ పోషణ వేడుకల్లో ఎంపీ శబరి

8వ రాష్ట్రీయ పోషణ వేడుకల్లో ఎంపీ శబరి

నంద్యాల: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నాయని నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు. బుధవారం పట్టణంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో జరిగిన 8వ రాష్ట్రీయ పోషణ మాసం వేడుకల్లో ముఖ్య అతిథిగా ఆమె పాల్గొన్నారు. సిబ్బంది ఏర్పాటు చేసిన పోషకాహర స్టాల్‌లను సందర్శించారు. ప్రజల పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని వైద్య సిబ్బందికి సూచించారు.