సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

W.G: నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ శనివారం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. నరసాపురం పట్టణం, మండలంలోని నలుగురు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి రూ. 2,48,250 అందజేశారు. సీఎం సహాయనిధి పేదల పాలిట వరమని.. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని నాయకర్ పేర్కొన్నారు.