హుజూర్ నగర్, కోదాడ రహదారులకు రూ. 130 కోట్లు మంజూరు!

హుజూర్ నగర్, కోదాడ రహదారులకు రూ. 130 కోట్లు మంజూరు!

SRPT: మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతిల కృషితో హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాల్లోని 49 కి.మీ. మేర సింగిల్ రోడ్లను డబుల్ రోడ్లుగా మార్చేందుకు ప్రభుత్వం రూ.130 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ​దీని ద్వారా హుజూర్ నగర్ పరిధిలో రూ. 62 కోట్లతో 26.50 కి.మీ, కోదాడ పరిధిలో రూ. 68 కోట్లతో 22.60 కి.మీ మేర అభివృద్ధి పనులు జరగనున్నాయి.