డీజిల్ లారీ బోల్తా.. తప్పిన పెనుప్రమాదం

డీజిల్ లారీ బోల్తా.. తప్పిన పెనుప్రమాదం

SKLM: టెక్కలి జాతీయ రహదారి మెలియాపుట్టి రోడ్డు ఫ్లై ఓవర్ సమీపంలో ఆదివారం వేకువజామున విశాఖ నుంచి పలాస వైపు వెళ్తున్న డీజిల్ ట్యాంకర్ లారీ ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. ఘటనలో ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో పెనుప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. ఘటనలో డ్రైవర్‌కు స్వల్పగాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు.