విప్లవాత్మక సంస్కరణలకు బీజం వేశారు: ఛైర్మన్
HNK: భారత ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలకు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు బీజం వేశారని గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మహమ్మద్ అజీజ్ ఖాన్ అన్నారు. హన్మకొండలోని పీవీ విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. పెట్టుబడులను ప్రోత్సహించడానికి ఆర్థిక సంస్కరణను రూపొందించిన పితామహుడు పీవీ అని ఛైర్మన్ అన్నారు.