సర్కిల్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన DCP

WGL: పర్వతగిరి పోలీస్ స్టేషన్‌లో సర్కిల్ కార్యాలయాన్ని వరంగల్ డీసీపీ అంకిత్ కుమార్ గురువారం తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. సిబ్బందికి తగు సూచనలు సలహాలు అందించారు. శాంతి భద్రతల పరిరక్షణలో ముందుండాలని ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా ఫ్రెండ్లీ పోలీస్ అమలు చేస్తూ ఫిర్యాదు దారుల పట్ల మర్యాద పూర్వకంగా వ్యవహరించాలని సూచించారు.