ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్

ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్

SRPT: ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులపై అధికారులు నిర్లక్ష్యం వహించకుండా సత్వరమే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన 69 దరఖాస్తులను స్వీకరించారు. అంగన్‌వాడీ పనులు, పీహెచ్‌సీల ఆధునీకరణకు 15వ ఫైనాన్స్ నిధులు వినియోగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు ఉన్నారు.