'వర్షాల వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి'

KMM: వర్షాల వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు దొండపాటి రమేష్ అన్నారు. మంగళవారం ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడులో వర్షానికి దెబ్బతిన్న పంటలను రైతు సంఘం నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలను సర్వే చేసి నష్టపరిహారం అందించాలన్నారు.